హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ATP: గుంతకల్లు పట్టణంలోని 132 కె.వి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడి నాగేంద్ర కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. 132 కెవి ఉప కేంద్రంలో పాత బ్రేకర్‌ను తీసి నూతన బ్రేకర్‌ను ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.