హైదరాబాద్: 28°C
వార్తలు

వైన్‌ షాప్‌ దారులతో ఎక్సైజ్‌ అధికారుల సమావేశం

KRNL: ఆలూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో వైన్‌ షాప్‌ లైసెన్స్‌దారులతో సమావేశం నిర్వహించారు. ఏఈఎస్‌ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లైసెన్సుల రెన్యూవల్‌ అంశంపై చర్చించారు. లైసెన్స్‌దారులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. సమావేశంలో సీఐ బీ. లలితాదేవి, ఎస్సై నవీన్‌కుమార్‌, షరీఫ్‌, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.