JN: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హన్మకొండలోని ఆయన నివాసంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు


