హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు నిధులు మంజూరు

NZB: నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. మంగళవారం నగరంలో ఆయన పర్యటించారు. నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన 46 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 32లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.