హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

18 ఎంపీటీసీలకు 60 పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా

GNTR: రెండో సాధారణ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఫిరంగిపురం మండల పరిషత్‌ పరిధిలోని 18 ఎంపీటీసీలకు సంబంధించి 60 పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ఎంపీడీవో పీ. శివ సుబ్రహ్మణ్యం మంగళవారం ప్రచురించారు. ముసాయిదా జాబితాపై ఈ నెల 15, 16 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.