హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగినాయునిపల్లిలో ఉచిత టీబీ పరీక్షలు

CTR: జిల్లాలోని పలమనేరు మండలం గంగినాయునిపల్లిలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత టీబీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 370 మందికి పరీక్షలు చేయగా, 68 మంది టీబీ అనుమానితులుగా గుర్తించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీబీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.