హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇరిగేషన్ శాఖలో అవినీతి కలకలం

KMR: జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేసిన జ్యోతి తనకు రావాల్సిన ఇంక్రిమెంట్, ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఫైళ్లను సిద్ధం చేయాలని కోరింది. అయితే ఫైల్ సిద్ధం చేసేందుకు కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిబ్బంది రూ.5వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేశారని జ్యోతి ఆరోపించింది.