CTR: పుంగనూరు పట్టణంలోని అన్యాక్రాంతమవుతున్న రాయలచెరువును సంరక్షించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ కోరారు. మంగళవారం రాయలచెరువు వద్ద ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే చెరువును కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చెరువును పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి'


