హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్ తనిఖీ

ప్రకాశం: పొదిలి మండలంలో పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను కలెక్టర్ విజయ సునీత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పొదిలి ఎంపీడీవో కార్యాలయం, తలమల్ల సచివాలయాలను సందర్శించి దరఖాస్తుల పురోగతిని పరిశీలించారు. రేపటితో పెన్షన్ దరఖాస్తులకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.