హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే ఆపరేటర్లకు పోలీసుల వార్నింగ్

VKB: వినాయక శోభాయాత్ర సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎస్సై ప్రశాంత్‌ వర్ధన్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 మంది డీజే ఆపరేటర్లను తహసీల్దార్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ ఎదుట రూ.2 లక్షల పూచీకత్తుతో బైండోవర్‌ చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.