హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS సీటు సాధించిన విద్యార్థినికి అభినందనలు

MBNR: జడ్చర్లకు చెందిన పుట్ట వర్ష ముదిరాజ్ మెరిట్ ఆధారంగా MBBSలో ఫ్రీ సీటు సాధించి, అప్పనపల్లి SVS మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందింది. వర్షను తెలంగాణ ముదిరాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు, జడ్చర్ల మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.