CTR: భార్యపై అనుమానంతో కొడవలితో దాడి చేసి హత్య చేసిన మదనపల్లెకు చెందిన రఘుకు చిత్తూరు ఆరో అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. 2023 ఆగస్టు 30న లక్ష్మీదేవిపై దాడి చేయగా, చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందింది. చిన్న కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రఘును అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి హరిత శిక్ష విధించారు.
ఆంధ్రప్రదేశ్
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు


