KMM: నాటి ఇంజనీర్ల అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన పాలేరు జలాశయం శతాబ్ద కాలానికి చేరువవుతోంది. నిజాం ప్రభుత్వ హయాంలో చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీజంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1923లో పనులు ప్రారంభమై, 1928లో దీని నిర్మాణం పూర్తయింది. బండరాళ్లు, బంకమట్టి, సున్నంతో కట్టిన ఈ ప్రాజెక్టు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి సాంకేతిక నైపుణ్యానికి అద్దం పడుతోంది.
తెలంగాణ
శతాబ్ద కాలానికి చేరువలో పాలేరు జలాశయం..!


