హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మ మెస్'లో అధిక వసూళ్ళు

KMM: ఖమ్మం ఎన్టీఆర్ బైపాస్‌లోని 'అమ్మ మెస్'లో రూ.20 ఎమ్మార్పీ ఉన్న పెప్సీ బాటిల్‌కు జీఎస్‌టీతో కలిపి రూ.28వసూలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజ్డ్ డ్రింక్స్‌పై ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేయడం నిబంధనల విరుద్ధం. నిత్యం వందలాది వినియోగదారులను మోసం చేస్తున్న ఈ హోటల్ తీరుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.