హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి

కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోతే అక్టోబర్‌ 2న విమానాశ్రయం ఎదుట నిరసన దీక్షలు చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. గన్నవరంలో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 13 ఏళ్లు గడిచినా 423 కుటుంబాలకు రూ. 30 కోట్ల పరిహారం అందలేదన్నారు.