GDWL: అలంపూర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కోసం తవ్విన మట్టిని రోడ్డు పక్కనే వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో స్థానికులు, ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మట్టి కుప్పలను తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'రోడ్డు వైపు మట్టిని తొలగించండి'


