KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఉదయం 9 గంటలకు జాబ్ మేళాకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 18న మెగా జాబ్ మేళా


