హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతరాజుపేటలో పెన్షన్ల దరఖాస్తుల వెల్లువ

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఇప్పటివరకు 140 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. నూతన పింఛన్ల దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 16తో గడువు ముగియనుంది. అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.