హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ గురుకులాలపై డిప్యూటీ సీఎం ఫోకస్‌

HYD: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, విద్య, గురుకులాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్‌ 19 నుంచి ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం కింద తొలి విడతగా లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల్లో కేంద్రీకృత వంటశాలల ఏర్పాటును చేయాలని సూచించారు.