హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సోషల్ మీడియాపై అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలి'

MLG: ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగిన విద్యార్థుల సమావేశంలో NSUI ములుగు మండల అధ్యక్షుడు వంగ శ్రీశాంత్ యాదవ్ మాట్లాడారు. సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కళాశాల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.