WGL: రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం వివాదంగా మారింది. ఇంటర్ డైరెక్టర్ సెప్టెంబర్ 7న ఉత్తర్వులు జారీ చేయగా, 15 రోజుల ముందే ఒకరిని అనధికారికంగా విధుల్లో చేర్చారని ఆరోపణలు వచ్చాయి. స్థానిక అర్హుడు టి.దేవేందర్ దరఖాస్తును డీఐఈఓ కార్యాలయం తిరస్కరించి, జనగామ అభ్యర్థికి అనుకూలంగా నియమించినట్లు దేవేందర్ ఆరోపించారు.
తెలంగాణ
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంలో డీఐఈఓపై ఆరోపణలు


