హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సమస్యలపై సీపీఎం ధర్నా

KMM: చింతకానిలో CPM ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ధర్నాలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సాగర్ జలాలు విడుదల చేయాలని, యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి సొసైటీల ద్వారా ఎరువులు అందించాలని కోరారు. మార్క్‌ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.