హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీచాముండేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపు

NLR: ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో కొలువైన శ్రీచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం హుండీల లెక్కింపు చేపట్టారు. 2 నెలల 12 రోజులకు హుండీల ద్వారా రూ.6,82,137, అన్నదానం ద్వారా రూ.87,358 సమకూరినట్లు ఆలయ ఛైర్మన్‌ గుండాల కృష్ణారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.