ATP: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జోన్న వెంకటేష్‌కు అనంతపురం పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. కక్కలపల్లి బాలికపై 2021లో దాడికి పాల్పడినట్లు అభియోగాలు రుజువయ్యాయి. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ జగదీష్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు


