హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత నీటికి డబ్బులా?

VSP: జీవీఎంసీ ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా నీరందించకుండా, చలానా కడితేనే పంపుతూ డబ్బులు వసూలు చేస్తోందని వైసీపీ నేత కేకే రాజు ఆరోపించారు. 26వ వార్డులో తమ నాయకులు సొంత ఖర్చుతో నీరందిస్తున్నట్లు తెలిపారు. ట్యాంకర్లపై ఉచితమని బోర్డులు పెట్టి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.