కృష్ణా: తేలప్రోలు గ్రామంలో వ్యవసాయ అధికారి గద్దె రమేష్ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వరి పంటలో పీడలు, తెగుళ్లను గుర్తించడం, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆకుముడత పురుగు నివారణకు సిఫార్సు చేసిన మందులను మోతాదులో వాడాలని సూచించారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్‌ను లీటరు నీటికి 0.6గ్రా పిచికారీ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తేలప్రోలు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం


