BDK: దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద గోదావరిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేయాలని సర్పంచ్ వాగే ఖాదర్‌బాబు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇక్కడ నిమజ్జనం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని, ఈ ఏడాది కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
పర్ణశాల వద్ద నిమజ్జనానికి అనుమతులకై ఎమ్మెల్యేకు విజ్ఞప్తి


