హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన వాహనాలకు పత్రాలు తప్పనిసరి: డీఎస్పీ

NLG: గణేష్ నిమజ్జనానికి వినియోగించే వాహనాలకు అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. మంగళవారం మండప నిర్వాహకులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిమజ్జనంలో పోలీసుల నిబంధనలు పాటించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డ్రైవర్లు మద్యం సేవించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.