హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు

KKD: సామర్లకోట రైల్వే గేటు సమీపంలో మంగళవారం బస్సు నుంచి దిగే ప్రయత్నంలో ఓ కాలేజీ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ నుంచి ఏలేశ్వరం వెళ్తున్న బస్సు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు, సిబ్బంది గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు