హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామపంచాయతీ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

BDK: భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులపై మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణతో కలిసి వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.