అన్నమయ్య: ప్రభుత్వ రెవెన్యూ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడప ఆర్డీవో మురళి హెచ్చరించారు. మంగళవారం మాధవరం పెద్దపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబర్ 937ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు, జేసీబీలతో చదును చేయడం వంటివి చేస్తే చర్యలు తప్పవన్నారు. దళిత రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు: RDO


