హైదరాబాద్: 28°C
తెలంగాణ

18న వనపర్తి జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్

WNP: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ సెప్టెంబర్ 18న వనపర్తి జిల్లాలో పర్యటించనుంది. ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరుకానున్నారు.