హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే

HNK: దామెరలో నిర్మిస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ నిర్మాణ పనులను నేడు MLA ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. రైతులకు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా డెయిరీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డెయిరీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.