MDK: వెల్దుర్తి మండలం హకీంపేట డ్యాం వద్ద జూదం ఆడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మ-బొరుసు ఆట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 24,510 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్టు


