హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్ ఎన్నికలకు కృషి చేయాలి: సీపీఎం

కాకినాడ రూరల్‌లోని ఆరు గ్రామాలను కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం చేసి, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కోరారు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వనసపాకల, వాకలపూడి గ్రామాల విలీనానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని కోరుతూ పార్టీ ప్రతినిధి బృందం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.