ASR: అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మహిళల భద్రత మనందరి బాధ్యత’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వేణుగోపాల్‌రావు స్వీయ రక్షణ, అప్రమత్తతపై అవగాహన కల్పించారు. సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఐ బి. కోటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ కె. శశికుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల భద్రతపై అవగాహన'


