హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాసభలకు మంత్రి ఫరూక్‌కు ఆహ్వానం

నంద్యాల జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను సంఘ జిల్లా నాయకులు జగన్‌మోహన్, మౌలాలి, మస్తాన్ ఆహ్వానించారు. మంగళవారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమంపై సభలో చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.