హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం: MLA

ADB: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.