హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్స్యకార సంఘాల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

AKP: మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని హోం మంత్రి అనిత పిలుపునిచ్చారు. నక్కపల్లిలోని తన నివాసంలో బోయపాడు, రాజయ్యపేట, దొండవాక, పెద్దతీనార్ల మత్స్యకార సంఘాల నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధత, స్థానిక సమస్యలపై చర్చించారు. సంక్షేమ పథకాలు మత్స్యకారులకు చేరేలా కృషి చేయాలన్నారు.