హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ఏడు మంది అరెస్ట్

ప్రకాశం: పొన్నలూరు (M) చెన్నిపాడు గ్రామ సమీపంలో సంగమేశ్వర ప్రాజెక్టు దగ్గర పేకాట నిర్వహిస్తున్న ఏడు మందిని ఎస్సై సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2670 నగదుతో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎక్కడైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.