హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి'

KKD: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గొల్లప్రోలు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం, బ్యాంకు ఖాతా పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీంతో గడువు పెంచాలన్నారు.