BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన మద్ది రాము రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. పార్టీ నాయకులతో కలిసి పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మద్ది రాము కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


