హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ బియ్యం స్వాధీనం.. ఆటో సీజ్

కోనసీమ: మగటపల్లి నుంచి ఆటోలో తరలిస్తున్న 300 కిలోల రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామిడికుదురు హైవే జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగుచూసింది. మామిడికుదురుకు చెందిన గోకవరపు శ్రీనివాసరావు వీటిని తరలిస్తున్నారని నగరం SI పద్మారావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. అక్రమ రవాణాపై చర్యలు తప్పవన్నారు.