హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ సచివాలయాలు తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డలోని గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం అవనిగడ్డలోని గ్రామ సచివాలయాలు-1,3,4 కార్యాలయాలను ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు, పనితీరు పరిశీలించారు. ఎన్టీఆర్ పింఛన్ భరోసా దరఖాస్తుల స్వీకరణ, నమోదు తీరు పరిశీలించారు. పేదల దరఖాస్తుల నమోదు వేగవంతం చేయాలని ఆదేశించారు.