హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

NTR: విజయవాడ 57వ డివిజన్ అమరావతి కాలనీ 4వ లైన్‌లో వినాయక చవితి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గణపతి వెంకట శివయ్య కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.