హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ఉత్సవాల్లో డీజే నిషేధం

BHNG: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం సమయంలో డీజెలు పూర్తిగా నిషేధమని రాజపేట SI తక్కియుద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల తర్వాత మైకుల వినియోగం నిషేధమని, మంటపం ఏర్పాటు చట్టపరమైన అనుమతులు అవసరమని తెలిపారు.