NLG: చిట్యాల మండలం 'వెలిమినేడు జెన్ జీ' ఆధ్వర్యంలో ఆ గ్రామ హైస్కూల్‌లో సెప్టెంబర్ 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ మేళా చేపడుతున్నామని, చుట్టుపక్కల 12 ఫార్మా కంపెనీలు మేళా లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'వెలిమినేడు జెన్ జీ' ఆధ్వర్యంలో జాబ్ మేళా


