హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషకాహారంపై విద్యార్థులకు అవగాహన

GNTR: పోషణ మాసోత్సవం-2026లో భాగంగా ఫిరంగిపురం (మం) నుదురుపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS సూపర్‌వైజర్‌ షేక్‌ మున్నీ మాట్లాడుతూ.. విద్యార్థులు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెప్పుకొచ్చారు.