హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రవిస్‌ హెడ్‌ చెత్త రికార్డు

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక ఫోర్‌తో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డపై అత్యల్ప స్కోరుకే వెనుదిరిగిన ఆసీస్ ఓపెనర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కాగా, వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది.