హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

NLR: తోటపల్లి గూడూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, లీప్ యాప్ డౌన్లోడ్, యస్.యస్.సి మిషన్ మార్చ్, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.